టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, IVF రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన మార్చి 23వ తేదీ అనగా గత 34 రోజుల నుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు మరియు మాస్కులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చంచల్ గూడ, సైదాబాద్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, బండ్లగూడ, ఆనంద్ నగర్, పెద్ద అంబర్ పేట్, గౌరెల్లి, నాగోల్, మనసురా బాద్, కొత్తపేట్, చైతన్యపురి, హనుమాన్ నగర్, జయపురి కాలనీ 58 సర్వే నంబర్ లో అన్నదాన కార్యక్రమం, మాస్కుల పంపిణీ నిర్వహించారు. అలాగే తెలంగాణలోని 33 జిల్లాల్లో ఐంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపున జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల ఫౌండేషన్ తరపున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
34వ రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, వలస కూలీలకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికులకు, నిరుపేదలకు, ఆటో డ్రైవర్లకు 2000 బిర్యానీ ప్యాకెట్లు, బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శానిటైజర్ల పంపిణీ కూడా ప్రారంభించారు. అలాగే వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్ కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు భోజనాలు, మాస్కులు అందిస్తున్నారు. వలస కూలీలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆరెస్ పార్టీ నాయకులు, ఐవీఎఫ్ నాయకులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారికి సాయమందించాలని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. కరోనాతో సీఎం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయడం జరుగుతోందన్నారు.
పేదలకు 12 కేజీల బియ్యంతో పాటు రూ.1500 అందించారని, అలాగే వలస కూలీలను తమ బిడ్డలుగా భావించి వారికికూడా 12 కేజీల బియ్యం, రూ.1500 అందిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారనన్నారు. ఇక తనవంతుగా పేదవారికి బియ్యంతో పాటు నిత్యవసరాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేసే సూచనలు విధిగా పాటించాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. పేదలకు సాయమందించేందుకు మానవతావాదులు, స్వచ్ఛంధ సంస్థలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ తో దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదవారికి ఆదుకునేందుకు ఉప్పల ఫౌండేషన్ అండగా నిలుస్తుందని వెల్లడించారు.