- Advertisement -
పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు.
రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, “డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యతగా భావించి వారి అకౌంట్లకు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది” అన్నారు.తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.
- Advertisement -