ఈశాన్య విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుండి కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, మరియు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సమాచారం. ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం.
రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.