వికారాబాద్‌ను కరోనా రహితంగా తీర్చిదిద్దుతాం..

203
Minister Sabitha
- Advertisement -

వికారాబాద్‌లో సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయంతో మంచి ఫలితాలు వచ్చాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏప్రిల్ 13న జరిగిన జిల్లా ఉన్నత స్థాయి సమావేశంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి 15వ తేదీ నుండి అమలు చేసిన కఠిన చర్యల ద్వారా ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని,గత మూడు నాలుగు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాక పోవటం ఇందుకు నిదర్శనం అన్నారు. శుక్రవారం నాడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి,తాండూరు ఎమ్మెల్వే పైలెట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ దశరథ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని హైదరాబాద్, వికారాబాద్, గద్వాల్, సూర్యాపేట్ లలో కరోనా కేసుల ఎక్కువుగా నమోదు కావడంతో సీఎం కేసీఆర్ ఈ పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అందులో భాగంగానే అదనంగా ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించారని మంత్రి అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులతో కలిసి కరోనాపై తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై ప్రతి క్షణం సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని అందు వల్లనే తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉందన్నారు.

ప్రైవేట్ పాఠశాలల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ట్యూషన్ ఫీజ్ ఒకేసారి వసూలు చేయకుండా ప్రతి నెల వాయిదా పద్ధతిలో వసూలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలా చేయని పక్షంలో 18004257462 నెంబర్‌కు ఫోన్ చేయాలని,లేదా commr.edn.greviance@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసెస్ కొనసాగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఆన్లైన్ క్లాసెస్ వినే విధంగా చూసుకోవాలని అన్నారు.టి సాట్ అప్ లో వీటిని వీడియో తరగతులు వినవచ్చన్నారు..అదేవిధంగా ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు డిజిటల్ లో పాఠ్య పుస్తకాలు www.scert.telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు.

పట్టణలలో సి జోన్ లో ఉన్న కాలనీలలో ఒక కేసు నమోదై ప్రస్తుతం కేసులు నమోదు కాకపోతే కాలనీలకు ఏర్పాటుచేసిన కంచెలను తీసివేయాలని అధికారులను కోరారు. కానీ ప్రజలు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదని అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్లపైకి రాకూడదని,మే 7 వరకు లాక్ డౌన్ ను తప్పనిసరి గా పాటించాలని మంత్రి సబితా రెడ్డి కోరారు.జిల్లాలో అన్ని శాఖల అధికారులు,24 గంటలు పనిచేస్తున్నారని వారికి మంత్రి అభినందించారు. ఎమ్మెల్యేలతో సహా ప్రజా ప్రతినిధులు కూడా అధికారులతో కలిసి పనిచేశారని వారిని కూడా మంత్రి అభినందించారు. ఏది విజయవంతం కావాలన్న ప్రజల సహకారమే ముఖ్యమని,ఇప్పటి వరకు సహకరించినట్లు భవిష్యత్తు లో కూడా సహకరించాలని మంత్రి కోరారు .

రంజాన్ ఉపవాసాల ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.లాక్ డౌన్ ను పాటిస్తూ ఇళ్ల లొనే ప్రార్థనలు, ఇఫ్తార్ లు,తరావి నమాజ్ లు చేయాలని మంత్రి కోరారు.ఈ మేరకు మత పెద్దలు,ఉలేమాలు కూడా పిలుపునిచ్చారు అని మంత్రి గుర్తు చేశారు.ఇప్పటికే శ్రీరామ నవమి,ఉగాది,గుడ్ ఫ్రైడే,ఈస్టర్, కూడా ఇళ్లలోనే చేసుకున్నట్లు అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు.ఈ నెలలో ప్రార్ధనల సందర్భంగా ముస్లింలు కరోనా నుండి విముక్తి చేయాలని అల్లాహ్ తో వేడుకోవలన్నారు. ఏప్రిల్ లో లాగానే మే నెలలో కూడా రేషన్ కార్డు పై ఒక్కొక్కరికి12 కిలోల బియ్యం,1500 నగదు, వలస కార్మికులకు కూడా అదే విధంగా అందజేయనున్నట్లు ,వలస కార్మికులు ఒకరే ఉంటే 500,ఇద్దరు ఉంటే 1000 ఆపైన ఎంత మంది ఉన్న 1500 అందించనున్నట్లు తెలిపారు.

రైతులు ఆందోళనకి గురి కావొద్దని,ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేస్తున్నాము అన్నారు..శనగల కొనుగోలు పై గౌరవ ముఖ్యమంత్రి దృషికి తీసుకెళ్లినట్లు శనగలతో పాటు పోద్దితిరుగుడు,జొన్నలు,వరి ధాన్యం,మొక్క జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు,రైతు పండించిన ప్రతి గింజను కొంటాం అని మంత్రి అన్నారు.ఇలా రైతుల పంటను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ,ఈ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది ఆని మంత్రి సబితా రెడ్డి అన్నారు.అధిక ధరలకు అమ్మే వ్యాపారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.జర్నలిస్టులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆడిషినల్ కలెక్టర్,మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -