- Advertisement -
ఈరోజు సూర్యపేట పట్టణంలోని కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయి, ఇంటికే పరిమితమైన స్థానిక 41వ వార్డు పేద కుటుంబాల ఇబ్బందులు గమనించిన రాజ్యసభ ఎం.పి. బడుగుల లింగయ్య యాదవ్ తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భరత్, టి.ఆర్.ఎస్ నాయకులు ఆయుబ్ ఖాన్ మరియు వార్డు ముఖ్యమైన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. లాక్ డౌన్ ముగిసే వరకు ప్రజలు బయటకు రావద్దు. స్వీయ నియంత్రణ తోనే కరోనా వైరస్ నిర్మూలన సాధ్యం.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలు, లాక్ డౌన్ నిబంధనలను తప్పక పాటిస్తు,అధికారులకు సహకరించి, లాక్ డౌన్ ముగిసేవరకు ఇళ్ల కే పరిమితం కావాలని అన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు.
- Advertisement -