రాష్ట్రంలో 5200 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని రైతుబందు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.1000 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, 100 కేంద్రాలు కందులు, శనగలు, 15 పొద్దుతిరుగుడు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు వరి 11లక్షల 62 వెల మెట్రిక్ టన్నులు, 1 లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశాం. ధాన్యం సరఫరాకు రోజు 20 వేల లారీలు మిల్లర్లు, గోదాముల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. లోడింగ్, అన్ లోడింగ్ వద్ద హమాలీల సమస్య ఉంది. తాలు, తేమను సంబంధించిన సమస్యలు అక్కడక్కడా వస్తున్నాయన్నారు.
కష్ట కాలంలో రైతులను ఆదుకోవడం మన భాద్యత అని కేసీఆర్ భావించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రం సూచించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం తాలు పట్టాలి, ఏఈవోతో రైతు సర్టిఫికెట్ తీసుకోవాలి.రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించక పోతే మిల్లర్ల దగ్గర ఇబ్బందులు వస్తాయి. లెక్కలు తెలియక, క్షేత్రస్థాయిలో వెళ్ళాక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల వరి ధాన్యానికి 333 కోట్లు, 46 కోట్లు మొక్కజొన్న రైతులకు ఖాతాలో జమ చేస్తున్నాం. రైతులు ఓపిక పట్టాలి, నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
గ్రామీణ ఉపాధి హామీ కోతలు, వ్యవసాయనికి అనుసంధానం చేయాలి. బీజేపీ నాయకుల దీక్ష ఎందుకు? కేంద్రం అన్ని పంటలను గిట్టుబాటు ధరలకు కొనాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయాలి. రైతులకు మేలు జరుగుతుంటే అలా జరగొద్దని బీజేపీ చూస్తోంది. కష్ట కాలంలో ఇబ్బందులను అధిగమించి అధికారులు పని చేస్తున్నారు. వారి మనోధైర్యంను దెబ్బతీయొద్దు. చిల్లర రాజకీయాలు చేయొద్దు. రైతు ధాన్యాన్ని ఏ రైతు దగ్దం చేయడు. అవసరం అయితే ఎవరికైనా దానం చేస్తాడు కానీ దగ్దం చేయడు. రాజకీయ నిరుద్యోగ వానర మూక అక్కడ తాలును దహనం చేశారు.