లోక సభ స్పీకర్‌తో ఉప్పల శ్రీనివాస్ కాన్ఫరెన్స్..‌

354
Uppala Srinivas Gupta
- Advertisement -

కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ అమలు చేసిన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమాల గురించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ను వీడియో కాల్ ద్వారా అడిగి తెల్సుకున్నారు లోక సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ కార్యక్రమంలో ఐవీఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, ఐవీఫ్ పది రాష్ట్రాల అధ్యక్షులు,హాంగ్ కాంగ్ ,ఇతర దేశాల ఐవీఫ్ అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతులకు గిట్టుబాటు ధర,ప్రభుత్వమే దినుసులు కొనడం,వలస కూలీలకు బియ్యంతో పాటు రూ. 1500 ,తెల్ల రేషన్ కార్డు దారులకు ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.1500 ఇచ్చారని తెలిపారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ఉదయం 6 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు కచ్చితంగా అమలు చేయడంతో తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని,వైద్య ,పోలీస్, పారిశుద్ద సిబ్బంది కూడా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విధుల్లో హాజరవుతున్నరని తెలిపారు. కేసీఆర్ స్వచ్ఛంద సంస్థలు,సంఘాలు కూడ పేద ప్రజలను ఆదుకోవాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడంతో ఐవీఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త పేద, వలస కార్మికులకు,బస్తీ వాసులకు నెలకు సరిపడ నిత్యావసర వస్తువులతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టినట్లు లోక సభ స్పీకర్ కు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఐవీఫ్ చేపట్టిన సేవా కార్యక్రమాలను తెల్సుకున్న లోక సభ స్పీకర్ ఓం బిర్లా సీఎం కేసీఆర్ ,ఉప్పల శ్రీనివాస్ గుప్తను అభినందించారు.

- Advertisement -