టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ఈ మాస్కును ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా ) పెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుందాం అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కార్యకర్తల అందరికీ పిలుపునిచ్చారు.
దయచేసి కార్యకర్తలు మాస్క్ లను పంపిణీ చేసేటప్పుడు గుంపులుగా కాకుండా దూరంగా (సోషల్ డిస్టెన్స్ ) ఉండి పంచాలని ఎంపీ సంతోస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. 27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం అని పేర్కొన్నారు.
20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…..
27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ….#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv— Santosh Kumar J (@MPsantoshtrs) April 22, 2020