కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు: సూర్యపేటలో సీఎస్

337
cs somesh kumar
- Advertisement -

కరోనాను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు సీఎస్ సోమేశ్ కుమార్. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సూర్యాపేటలో పర్యటించిన సీఎస్…సూర్యాపేట పట్టణంలో జనసమ్మర్దం ఎక్కువగా ఉండె కూరగాయల మార్కెట్ లో ఒక వ్యక్తికి పాజిటీవ్ రావడం వల్ల అది ఎక్కవగా సంక్రమణ చెందిందని తెలిపారు.

ఇప్పటి వరకు ప్రైమరీ కాంటాక్ట్స్ అన్ని గుర్తించి వారందర్ని క్వారంటైన్ కు తరలించామని తెలిపారు. చుట్టు పక్కల పాజిటీవ్ వచ్చిన గ్రామాల్లో కూడా వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించాం అన్నారు.

సూర్యాపేట పట్టణంలో కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాల్ని కల్పిస్తున్నామని…లాక్ డౌన్ ను మరింత కఠినంగా పటిష్టంగా అమలు చేస్తాం అన్నారు.అధికారులు, పోలీసులు , వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని..ప్రజలు తేలిగ్గా తీసుకొవద్దు….. ఇంటి నుంచి కాలు బయట పెట్టవద్దన్నారు.

- Advertisement -