- Advertisement -
వలస కూలీలను ఆదుకోవడానికి తాను సైతం అంటూ ముందుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి వలస కూలీలకు ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు తమన్నా.
ముంబైలోని 10వేల మంది వలస కూలీల కోసం 50 టన్నుల ఆహార పదార్థాలను సిద్ధం చేసింది తమన్నా. వలస కూలీలను ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
కోవిడ్-19 వల్ల భయంకర పరిస్థితి ఏర్పడిందని కోట్లాది మంది జీవితాలపై ఇది ప్రభావం చూపిందన్నారు. కరోనాను అరికట్టాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమన్నారు.
కరోనా నేపథ్యంలో చాలా కుటుంబాలకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొందని అందుకే తాను లెట్స్‌ఆల్‌హెల్ప్.ఓఆర్‌జీతో చేతులు కలిపి సాయం చేస్తున్నాని వెల్లడించింది. ఆకలితో అలమటించే వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ మందుకురావాలని కోరింది.
- Advertisement -