ఉప్పల ఫౌండేషన్ తరపున భోజనాలు పంపిణీ..

210
uppala srinivas
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటినుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిలక్ నగర్, పటేల్ నగర్, నల్లకుంట, గోల్నాక, జయపురి కాలనీ 58 సర్వే నం, మనసురాబాద్, ఎల్బీనగర్, సాయిరాంనగర్, బండ్లగుడ, వీ స్పోర్ట్స్ కాలనీ, శివ ఫంక్షన్ హాల్ తో పాటుగా నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ నివాసం వద్ద భోజనాలు పంపిణీ చేసారు.

అలాగే ప్రతీరోజే 2వేలమంది పారిశుద్ధ్య కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, వలస కూలీలకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికులకు, నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, 9వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఉప్పల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆరెస్ పార్టీ నాయకులు, ఐవీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

uppala foundation

- Advertisement -