గ్రేట్ పోలీస్.. గ్రామాన్నే దత్తత తీసుకున్నాడు..!

189
ramgundam cp
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆదేశాలు,ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ సూచనల మేరకు లాక్ డౌన్ ముగిసే వరకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ కొలంగుడ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. హాజిపూర్ మండలం కొలాంగూడ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో 38 ఆదివాసీ కొలాం కుటుంబాలకు బట్టలు,నిత్యావసర వస్తువులు సిపి సత్యనారాయణ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి,ఎసిపి లక్ష్మి నారాయణలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ర్ ఆదేశాలు,ఎంపి సంతోష్ కుమార్ సూచనల మేరకు కొలం గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని,లాక్ డౌన్ ముగిసే వరకు ఇక్కడి ఆదివాసీలకు నిత్యావసరాలు,బట్టలు, వైద్యం తో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

రామగుండం పోలీస్ కమిషనరెట్ పరిధిలోని పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలో 3 కరోనా కేసులు నమోదు అయిన, సెకండరీ కాంటాక్ట్ ద్వారా ఎవ్వరికీ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు, మనం ఇప్పటికీ సేఫ్ జోన్‌లో ఉన్నాం.ఇప్పటికీ పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల్లో లాక్ డౌన్‌ను ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చిన 8000 వేల వాహనాలు సీజ్ చేసి,800 కేసులు నమోదు చేశాం.మే7 వరకు లాక్ డౌన్‌ను మరింత పడ్బందిగా అమలు చేస్తామని కమిషనర్ అన్నారు.

- Advertisement -