మద్దతు ధరలేని పంటలు..మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు

270
markfed
- Advertisement -

మద్దతు ధర లేని పంటలను కూడా మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తోందన్నారు మార్క్ ఫెడ్ ఛైర్మన్ గంగారెడ్డి.హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు 890 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం…మార్క్ ఫెడ్ ద్వారానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఫర్టిలైజర్ సరఫరా చేస్తాం అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి ఆహారా ధాన్యాలు తెలంగాణకు రావడం లేదు, రాష్ట్రం నుంచి అంతర్ రాష్టాలకు పంటలు వెళ్లడం లేదని…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్ లో పెసర్లు 7650 రూపాయలకు 5803 మెట్రిక్ టన్నుల కొన్నాం అన్నారు.

సోయాబీన్ ను 3510 రూపాయల చొప్పున 10497 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని….మొక్కజొన్నలు 13 లక్షల 51572 మెట్రిక్ టన్నులు వస్తుందని భావిస్తే 98502 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రస్తుతం అనుకున్న దానికంటే ఎక్కువ పంట వచ్చిందన్నారు.

ఇంకా 7,8 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా వస్తాయని భావిస్తున్నామని…కేంద్రం వెయ్యి కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3500 కోట్లు కేటాయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని…దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు.

రైతులు పంట పొలాలకు వెళ్లెప్పుడు సామాజిక దూరం పాటించాలని…అన్ని పంట ఉత్పత్తులకు నగదును కూడా చెల్లిస్తున్నాం. వారం రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతాయని చెప్పారు.

- Advertisement -