- Advertisement -
టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కొత్త అవతారం ఎత్తనున్నారు. 2019లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువీ తాజాగా సోషల్ మీడియా ద్వారా కైఫ్‌తో చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కామెంట్రీ బాక్స్‌లో కొందరి వాదనలు భరించలేని విధంగా ఉన్నాయని కాబట్టి ఐసీసీ ఈవెంట్స్‌లో కామెంట్రీ చెప్పాలని ఉందన్నారు. గ్రౌండ్‌లో ఒత్తిడి ఆటగాళ్లకి మాత్రమే తెలుస్తుందని వారిని అనవసరంగా విమర్శించడం తనవల్ల కాదన్నారు.
2007,2011లో ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న యువీ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. దాదా తరహాలో తనకు ధోని నుండి సపోర్ట్ లభించలేదని అందుకే టీమిండియాకు దూరమయ్యానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. యువీ తండ్రి కూడా ధోనిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
- Advertisement -