మతం కంటే మానవత్వం గొప్పది…

344
harish shankar
- Advertisement -

మహారాష్ట్రలోని పాలఘర్ పరిధిలో ఈనెల 16న జరిగిన సాధువుల హత్యోదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు దర్శకుడు హరీష్ శంకర్. సాధువులను కిరాతకంగా చంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో జరిగిన క్రూరమైన హత్యోదంతాన్ని చూసి చాలా బాధపడ్డాను. ఓ మతానికి సంబంధించి ఇలా జరిగిందని నేను బాధపడటంలేదు. ఎందుకంటే, మతం కన్నా మానవత్వం గొప్పదని నేను భావిస్తాను. కానీ, లౌకికవాదుల నుంచి ఇలాంటి ట్వీట్లు చూడలేకపోవడం బాధగా ఉందన్నారు.

దయచేసి హిందువులకు న్యాయం జరగాలి అనే నినాదాన్ని తీసుకురాకండి. మానవత్వానికి న్యాయం జరగాలని మనం పోరాడాలి. మతాన్ని అడ్డుపెట్టుకుని ఈ మరణాలపై రాజకీయాలు చేస్తున్నవారిని చూసి నాకు జాలేస్తోంది. హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది అంగీకారయోగ్యం కాదన్నారు.

- Advertisement -