మే 7 చివరి రోజు కావాలి…

255
telangana doctors
- Advertisement -

కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడగించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్‌ని పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రానున్న 15 రోజులు కీలకమని ప్రజలంతా తప్పనిసరిగా సామాజిక దూరం, లాక్‌ డౌన్‌ను పాటించాలని సూచించారు.

కరోనా నుండి బయటపడేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రజలు తప్పనిసరిగా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లకు పరిమితమైతే కరోనా చైన్‌ను తెగ్గొట్టవచ్చని హాట్‌స్పాట్లు,కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. .

కొత్త కేసులను గుర్తించి బాధితులను వెంటనే ఐసొలేట్‌ చేయడం లాంటి చర్యలను మరికొంత కాలంపాటు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చని వారు తెలిపారు. లాక్‌డౌన్‌కు మే 7 చివరిరోజు కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -