ఎన్టీఆర్‌ మహేష్‌ని దాటాడు…

518
Janatha Garage' 1st day box office collection
Janatha Garage' 1st day box office collection
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సమంత-నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటించిన జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వచ్చేసింది. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై ముందు నుంచి చాలానే అంచనాలు ఉండగా.. రికార్డులు తిరగరాసేస్తుందని అభిమానులు గట్టిగానే నమ్మారు.

నిన్న విడుదలయిన ఈ చిత్రానికి అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్.

ఇప్పుడు జనతా గ్యారేజ్ యూఎస్ కలెక్షన్స్ కి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. కేవలం ప్రీమియర్లతోనే హాఫ్ మిలియన్ మార్క్ దాటేశాడు జూనియర్. తన కెరీర్ బెస్ట్ స్థాయిలో.. ప్రీమియర్లతో 560k డాలర్లను రాబట్టాడు. ఎన్టీఆర్ కి ఇది చాలా పెద్ద రికార్డ్ అనాల్సిందే. ప్రీమియర్ షో ల వసూళ్లను బట్టి చూస్తే.. 156 లొకేషన్స్ లో జనతా గ్యారేజ్..560 కి పైగా డాలర్లు వసూలు చేసిందని ఈ వర్గాల అంచనా. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ శ్రీమంతుడు చిత్రంకన్నా ఇది ఎక్కువేనని చెబుతున్నారు.

Janatha Garage' 1st day box office collection

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ 615 డాలర్లు కలెక్ట్ చేసిందని కానీ..బాహుబలి తర్వాతేనని అంటున్నారు. బాహుబలి మాత్రం 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జనతా గ్యారేజ్ కి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ..మొదటి రోజే 23 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. ఆ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.

సర్దార్ గబ్బర్ సింగ్ కు ప్రీమియర్ల ద్వారా 615k డాలర్లు రాగా.. గ్యారేజ్ 560k డాలర్ల దగ్గరే ఆగిపోయింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం 7.2 కోట్ల రూపాయలు చెల్లించడంతో.. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు ఇంకా చాలా మొత్తమే రాబట్టాల్సి ఉంటుంది. కనీసం 2మిలియన్లను కలెక్ట్ చేసే మూవీగా అంచనా వేసినా.. మాస్ సినిమాలను పెద్దగా ఆదరణ లభించని ఈ జోన్ లో.. టాక్ అంత గొప్పగాలేని గ్యారేజ్.. ఆ ఫీట్ సాధించడం కష్టం కావచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.
ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్ లో టాప్ 5 మువీస్, వ‌సూళ్లిలా ఉన్నాయి.

బాహుబ‌లి$2.42M
శ్రీమంతుడు $1.13M
స‌ర్థార్ గ‌బ్బ‌ర్ సింగ్$805K
బ్ర‌హ్మోత్స‌వం $800K
జ‌న‌తా గ్యారేజ్ $60K

సుమారుగా 2000 వేల థియేటర్ లలో సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసిందని సమాచారం. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం: 5.65

సీడెడ్: 3.72
గుంటూర్: 2.58
వైజాగ్: 2.30
ఈస్ట్: 2.28
వెస్ట్: 1.85
కృష్ణ: 1.54
నెల్లూరు: 0.89
- Advertisement -