ఉద్యోగులను తొలగించొద్దు: మంత్రి కేటీఆర్

229
ktr
- Advertisement -

కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలకు లేఖలు రాశారు మంత్రి కేటీఆర్. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని.. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు.

ఉద్యోగుల భద్రతకు యాజమాన్యాలు కృషి చేయాలని..ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీలకు సూచించారు. లాక్‌డౌన్‌ తరువాత త్వరలోనే పరిశ్రమలు పుంజుకుంటాయని పేర్కొన్నారు.

ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరుకోగా మ‌ర‌ణాల సంఖ్య 480కి చేరింది.

- Advertisement -