కరోనా కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి అనేక మంది, సంస్థలు ముందుకు వస్తూనే ఉన్నాయి. అనేక మంది దాతలు తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తూ, తమ ఉదారతని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ పైళ్ళ మల్లారెడ్డి కోటి 116 రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు. ఈ మొత్తానికి చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల రామారావుకి శనివారం ప్రగతి భవన్ లో పైళ్ళ మల్లారెడ్డి ప్రతినిధి అందచేశారు.
సిఎం సహాయ నిధికి ధనలక్ష్మీ ట్రేడర్స్ రూ.5లక్షల విరాళం ప్రకటించింది. ఈ విరాళం మొత్తానికి చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల రామారావుకి శనివారం ప్రగతి భవన్ లో ఆ సంస్థ ప్రతినిధి రమేశ్ కుమార్ చౌదరి అందచేశారు. తమ వంతుగా ఈ సహాయాన్ని అందచేస్తున్నట్లు, కరోనా నిర్మూలనకు ఉపయోగించాలని ఆయన కోరారు.