- Advertisement -
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీల వసూళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 20 నుండి లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో టోల్ వసూళ్లను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐకి లేఖ రాసింది కేంద్రం.
ట్రక్కులు మరియు ఇతర వస్తువులు/క్యారియర్ వాహనాలు అంతర్రాష్ట్రంలో కదలికలు కొనసాగుతున్న సమయంలో హోంమంత్రిత్వ శాఖ అందించిన సడలింపుల దృష్ట్యా.. ఎన్హెచ్ఏఐ చర్యలు తీసుకుంటోంది.
టోల్ వసూళ్లను మార్చి 25 నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం సూచనపై రవాణా సంఘాలు మండిపడుతున్నాయి. రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తుంటే.. ఈ నిర్ణయం సరికాదని కేంద్రానికి సూచించింది.
- Advertisement -