- Advertisement -
తెలుగు సినీ కార్మికులకు అండగా నిలిచారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తనవంతు సాయాన్ని అందించి మెగాస్టార్ అనిపించుకున్నారు.
బిగ్ బజార్‌కు చెందిన 12000 కూపన్స్ విరాళంగా ఇచ్చారు. ఒక్కొక్క కూపన్ విలువ 1500 రూపాయలు కాగా.. వీటిని బిగ్ బజార్‌లో షాపింగ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. వీటి విలువ దాదాపు 1.8 కోట్ల ఉండనుందని సమాచారం.
ఇక ఈ సందర్భంగా అమితాబ్‌కు థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి. చిత్ర పరిశ్రమలన్నీ ఒక కుటుంబంగా భావించి అమితాబ్ ఈ సాయం చేశారని తెలిపారు.
ఇక ఇప్పటికే సీసీసీకి హీరోలు,హీరోయిన్లు,నిర్మాతలు పెద్ద ఎత్తున స్పందించి విరాళం అందించిన సంగతి తెలిసిందే.
- Advertisement -