అందరూ సామాజిక దూరం పాటించాలి- జగదీష్ రెడ్డి

153
jagadeesh reddy
- Advertisement -

నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో హెల్పింగ్ హాండ్స్ అనే వాట్సప్ గ్రూప్ ద్వారా సేకరించిన ఆర్ధిక సహాయంతో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను, బియ్యాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,జెడ్పీటీసీ నారాబోయిన స్వరూప రవి ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ప్రారంభంలో ఎక్కడో విమానాల్లో తిరిగే వాళ్లకు వస్తుంది కదా మనకేందుకులే అనుకున్నాం.. ఉగాది ముందు వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా లేదు. కానీ ఉగాది మరుసటి రోజే ఊహించని విధంగా మన జిల్లాలో,గ్రామాల్లో కరోనా బయట పడింది.. అందుకే ఎవరు కూడా మనకు కరోనా రాదులే అనే నిర్లక్ష్యం వద్దు అని మంత్రి కోరారు.

దురదృష్టవశాత్తు ఢిల్లీ మర్కజ్‌ ప్రార్ధనలకు వెళ్లిన వారితోనే జిల్లాలో కరోనా ఎక్కువగా వ్యాపించింది. అందరూ సామాజిక దూరం పాటించాలి. ఎవరికి కరోనా ఉందో మనుకు తెలియదు కనుక దూరంగా ఉండాలి. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. లాక్‌ డౌన్‌ నిబంధనలు అందరూ పాటించాలని మంత్రి కోరారు. అలాగే ఈ కష్టకాలంలో మనందరి కోసం పని చేస్తున్న వైద్యులకు,పోలీసులకు,పారిశుద్య కార్మికుల మంత్రి ధన్యావాదాలు తెలియజేశారు.

- Advertisement -