కరోనా హాట్‌స్పాట్‌ల జాబితా ఇదే..

181
coronavirus
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా కేంద్రం విభజించింది. దేశంలోని మొత్తం 700 జిల్లాలను హాట్‌స్పాట్‌ జిల్లాలు, హాట్‌స్పాట్‌యేతర జిల్లాలు, గ్రీన్‌ జోన్‌ జిల్లాలుగా విభజించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లను కేంద్రం కోరింది.

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాశారు. 28 రోజులపాటు ఒక్క కేసు నమోదు కానిపక్షంలో హాట్‌స్పాట్‌ను గ్రీన్‌జోన్‌లోకి మార్చాలంది. హాట్‌స్పాట్‌ జిల్లాలు, కంటైన్మెంట్‌ జోన్ల వివరాలను రాష్ట్రాలకు పంపించింది. తెలంగాణలో హాట్‌స్పాట్‌ జిల్లాల వివరాలను సైతం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది.

ఈ జాబితాలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి అర్బన్‌, గద్వాల, మేడ్చల్‌, కరీంనగర్‌, నిర్మల్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలుగా కేంద్రం ప్రకటించింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, శ్రీకాకుళం మినహా 11 జిల్లాలు హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా కేంద్రం గుర్తించింది.

- Advertisement -