దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడగించిన నేపథ్యంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు మెగా హీరో వరుణ్ తేజ్. అయితే అభిమానులతో మాత్రం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.
తనకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పిన వరుణ్…మెగా హీరోల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అంటూ చిరంజీవి – నన్ను ఎంతగానో ఎంకరైజ్ చేస్తారు,నాగబాబు – పిల్లర్ ఆఫ్ స్టెంత్,పవన్ కళ్యాణ్ – హానస్టీకి మరో పేరు,రామ్ చరణ్, అల్లు అర్జున్ – ఇద్దరూ ఇద్దరే.. మంచి హార్డ్ వర్కర్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
నా గత సినిమా డైరెక్టర్ అని ‘గద్దలకొండ గణేష్’ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే తనకు క్రష్ అని తెలిపారు. కంచె లాంటి కథ కోసం వెతుకుతున్నా.. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేయాలనుందని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్‌లో తనకు షారుఖ్ ఖాన్ అంటే ఇష్టమని …ఛాన్స్ వస్తే సాయిధరమ్‌తో ఖచ్చితంగా మల్టీస్టారర్ చేస్తానని తెలిపిన వరుణ్..మంచి కథ కోసం చూస్తున్నామని తెలిపారు.