- Advertisement -
దేశంలో ఇంకా కొన్నాళ్ల పాటు వమాన సర్వీసులు నడవవు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో లాక్ డౌన్‌ను మే 3 వరకు పొడగించడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వరకు నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
ఇప్పటికే తొలుత అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన కేంద్ర ఆ తర్వాత దేశియ వివమాన సర్వీసులను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా కార్గో రవాణా చేసే విమానాలను మాత్రం అనుమతిస్తారు.
- Advertisement -