తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటంచాలని తెలియజేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కూడా ప్రజల శ్రేయస్సే కొరకు అవగాహనా కల్పించే బాధ్యత తీసుకున్నారు. ప్రజాశ్రేయస్సే తన శ్రేయాస్సుగా భావించే సంతోష్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తనవంతు బాధ్యత పోషిస్తున్నారు.
సామాజిక దూరం పాటించండం, స్వీయనిర్బంధం పైన, వ్యక్తిగత పరిశుభ్రత పైన ఇలా ప్రతి అంశం పైన తను ముందుగా పాటించి, ఇతరులు కూడా పాటించాలని, వారి క్షేమం కోసం అనునిత్యం ప్రజలని తన చరవాణి ద్వారా సోషల్ మీడియా వేదికగా ప్రజలని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ.. బాధ్యతగా ఉండాలి అని సూచిస్తున్నారు. ముందుగా మన వ్యక్తిగత క్షేమమే, కుటుంబ క్షేమంగా, రాష్ట్ర క్షేమంగా, దేశ క్షేమం అవుతుందని పరోక్షంగా తెలియజేస్తున్నారు.
Setting the standards before asking others to follow.
Here’s our Honble Chief Minister #KCR sir with the protective face mask👇. #StayHome #StaySafe #LockdownTelangana#FightAgainstCoronaVirus pic.twitter.com/nd48SKqjHn— Santosh Kumar J (@MPsantoshtrs) April 13, 2020