- Advertisement -
సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు.
సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే మహానీయుడని ముఖ్యమంత్రి కీర్తించారు. కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన అందరికీ విద్యనందించాలని ఉద్యమం చేపట్టి ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలే ఫూలేకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి అన్నారు.
- Advertisement -