తమన్నాకు సారీ చెప్పిన దర్శకుడు

248
- Advertisement -

హీరోయిన్లపై కమెడియన్లే కాదు కొందరు డైరెక్టర్లు కూడా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విశాల్, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు సినిమా డైరెక్టర్ సూరజ్ హీరోయిన్ డ్రస్సింగ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సూరజ్ ఓ ఇంటర్వ్యూలో తమన్నా కాస్ట్యూమ్స్‌పై సూరజ్ సంచలన కామెంట్స్ చేశాడు.

కాస్ట్యూమ్ డిజైనర్ తన దగ్గరికొచ్చి మోకాళ్ల కిందకు కవర్ చేసేలా డిజైన్ చేసినట్లు చెప్పారని, కానీ మోకాళ్ల పైకి కురచగా ఉండేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయమని చెప్పినట్లు సూరజ్ కామెంట్ చేశాడు. హీరోయిన్ సౌకర్యంగా ఫీలయ్యిందా లేదా అనే విషయం కంటే అవుట్ పుట్ ఎంత బాగా వచ్చిందనేదే ముఖ్యమని చెప్పాడు. ఎందుకంటే ఆడియన్స్ డబ్బులిచ్చి మరీ అలాంటి డ్రస్స్‌ల్లో హీరోయిన్స్ గ్లామర్ చూడటానికి వస్తారని అన్నాడు. ఒకడుగు ముందుకేసి హీరోయిన్లు టీవీ సీరియల్స్‌లో తమ నటనను ప్రదర్శించొచ్చని, కానీ తాను తీసింది కమర్షియల్ సినిమా అని చెప్పాడు. ఆడియన్స్ డబ్బులిస్తున్నప్పుడు హీరోయిన్స్ కూడా తమ గ్లామర్‌ను ప్రదర్శించాలిగా అంటూ వ్యాఖ్యానించాడు.

Tamannah is very angry

ఈ కామెంట్స్‌పై మిల్కీ బ్యూటీ తమన్నా తీవ్ర స్థాయిలో మండిపడింది. దర్శకుడు సురాజ్‌ వ్యాఖ్యలు చాలా బాధించాయని, కేవలం తనకే కాదు మొత్తం చిత్ర పరిశ్రమలో ఉన్న నటీమణులకు ఆయన క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. నటీనటులుగా ప్రేక్షకులకు వినోదం పంచడం తమ బాధ్యతని, అంత మాత్రాన తమని ఆకర్షించే వస్తువుల్లా చూడటం సహించలేమన్నారు.

ఈ విషయంపై నయనతార, విశాల్‌ సైతం తీవ్రంగా స్పందించారు. దర్శకుడు సురాజ్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో వెనక్కి తగ్గిన సురాజ్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘నన్ను క్షమించండి.. తమన్నాకు, చిత్ర పరిశ్రమలోని నటీమణులందరికీ క్షమాపణలు. ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మరోసారి క్షమించమని అడుగుతున్నా. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా’ అని సురాజ్‌ పేర్కొన్నారు.

- Advertisement -