కరోనాపై పోరులో క్రీడాకారుల పాత్ర చాలా ముఖ్యం- మోదీ

430
- Advertisement -

కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యటు చేపడుతున్నాయి. అయితే కరోనా నివారణకు ఎంతోమంది ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్ గంగూలీ, విరాట్‌ కోహ్లీ, పీవీ సింధు, మేరీ కోమ్‌ సహా భారత్‌లోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

modi

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో క్రీడాకారుల పాత్ర చాలా ముఖ్యమని మోదీ అన్నారు. దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో సాధారణ ప్రజలతో పాటు అన్ని రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంతమంది పౌరులు లాక్‌డౌన్‌ పాటించకుండా ఇండ్ల నుంచి బయటకు వస్తుండటంతో వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందన్నారు మోదీ. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలను చైతన్య పరచాలని ప్రధాని వారిని కోరారు.

దేశంలో ప్రస్తుత పరిస్థితిని వివరించడంతోపాటు లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ సూచించారు. మోదీ నాయకత్వాన్ని క్రీడాకారులు ఈ సందర్భంగా ప్రశసించారు. నిస్వార్థంగా పని చేస్తోన్న వైద్య సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -