- Advertisement -
కరోనా ఈ పేరు వింటేనే యావత్ ప్రపంచం గడగడలాడిపోతోంది. కరోనాతో ఇప్పటికే వందలాది దేశాలు లాక్ డౌన్ ప్రకటించగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 200కి పైగా దేశాలకు కరోనా విస్తరించగా వేలాది మంది మృత్యువాత పడ్డారు.
తాజాగా ప్రపంచ ప్రసిద్ధ ఛానెల్ సీఎన్ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్ క్రిస్ క్యూమోకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మార్చి 31న ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
గత కొద్దిరోజులగా ఆయన కరోనా రోగులతో పలు కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ ప్రోగ్రామ్‌లో క్రిస్ పాల్గొనాల్సి ఉండగా ట్విట్టర్ ద్వారా ఆయన తనకు కరోనా పాజిటివ్ అని షాకింగ్ న్యూస్ చెప్పారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.
- Advertisement -