దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ఊరటనిచ్చే పలు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా రిలయన్స్ జియో కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మేరకు జియో యూజర్లకు ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల కాల్స్, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది. ప్రీపేయిడ్ వ్యాలిడిటీ అయిపోయినా.. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్ కాల్స్ సదుపాయాన్నికల్పిస్తామని వెల్లడించింది జియో సంస్థ.
అలాగే మరో ఆఫర్ కూడా అందుబాటులోకి తెచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి జియోఫైబర్ 10 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రిలయెన్స్ జియోఫైబర్ ఈ ఆఫర్ అందిస్తోంది. వీలైన ప్రాంతాల్లో, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఈ ప్లాన్ అందించనుంది రిలయెన్స్ జియోఫైబర్.
భారతదేశంలో లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఈ కొత్త ప్లాన్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ తర్వాత సబ్‌స్క్రైబర్లు ఉచిత ప్లాన్ నుంచి ప్రస్తుతం ఉన్న ఇతర ప్లాన్స్‌లోకి మారొచ్చు.. మీరు ఉచితంగా జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్ పొందాలనుకుంటే జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.