2021లో టోక్యో 2020 పేరుతోనే ఒలింపిక్స్‌…

258
olympics
- Advertisement -

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఎప్పుడు ఒలింపిక్స్ జరుగుతాయా అన్న దానిపై క్లారిటీ ఇచ్చింది టోక్యో విశ్వ క్రీడల నిర్వాహక కమిటీ.

2021 జూలై 23న విశ్వక్రీడలు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 8వ తేదీతో ముగియనున్నాయి. పారాలింపిక్స్ ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 5వరకు జరుగుతాయి అని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరి ప్రకటించారు. 2021లో జరిగినా టోక్యో 2020 పేరుతోనే ఒలింపిక్స్ జరుగనున్నాయి.

వాస్తవానికి ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన ఒలింపిక్స్​ను కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -