ఖమ్మం జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండటానికి వీలు లేదన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పేదలకు అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రూ.5లకే భోజనం పెడతామని చెప్పారు. 5రూపాయలు కూడా ఇవ్వలేని వారికి పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భోజనం పెట్టనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా సంపన్నులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళాలు ప్రకటించాలని కోరారు. ఆపద సమయం లో ఆపన్న హస్తం తో ముందుకురావాలి అన్నారు.
మంత్రి పువ్వాడ పిలుపుతో గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు స్పందించారు. సీఎం సహాయ నిధికి 10 లక్షల సాయం అందించారు. అలాగే సీఎం సహాయ నిధికి 5 లక్షల చెక్కును సాయం గా అందజేశారు ఖమ్మం రాక్స్ ఓనర్ తుళ్లూరు కోటేశ్వరరావు. శ్రీమంత గ్రూప్ ఆఫ్ గ్రానైట్స్ బాలస్వాములు కూడా సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.