- Advertisement -
కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా హడలిపోతోంది. ఇప్పటి వరకు అమెరికాలో లక్షా 40 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్19 వల్ల దేశంలో 2436 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో యుఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కరోనాను నియంత్రించేందు సోసల్ డిస్టన్స్ ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడగిస్తున్నట్లు తెలిపారు. రానున్న రెండు వారాల్లో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని… ఇన్‌ఫెక్షన్ రేటు అధికంగా ఉన్నదని, రానున్న రోజుల్లో హాస్పటళ్లు నిండిపోనున్నట్లు తెలిపారు ట్రంప్.
కరోనా వైరస్ వల్ల సుమారు రెండు లక్షల అమెరికన్లు చనిపోయే ప్రమాదం ఉందని వైట్‌హౌజ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు.
- Advertisement -