కరోనా వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదుఃమంత్రి హ‌రీశ్

237
harish rao
- Advertisement -

కరోనా వ్యాధి కి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు. జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కరోన వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యల పై మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో ఎంయల్ఎ మానిక్ రావు , ఎంపీ బీబీ పాటిల్, ఎంయల్సి ఫారిదుద్దీన్ లు పాల్గోన్నారు.

ఈసంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ….కరోనా వ్యాధి కి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్ లలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే దాయకండి..వైద్యుల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు. సరిహద్దు గ్రామాల ప్రజలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిని మన రాష్ట్రంలోకి రానివ్వ‌ద్ద‌న్నారు. వలస కూలీలు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే వారికి భోజన వసతి ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జహీరాబాద్ ప్రాంతంలో సెనెగలు పండించే రైతుల కోసం జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

- Advertisement -