- Advertisement -
నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంటలో కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రాచీన పద్దతులు పాటిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రాచీన కాలంలో ఏదైనా వ్యాధులు సంక్రమించి నప్పుడు ఒక పద్ధతిని గ్రామస్తులంతా ఉపయోగించేవారు. అదే పద్ధతిని ఇప్పుడు చేగుంట గ్రామంలో గత వారం రోజుల నుంచి ప్రయోగిస్తున్నారు.
ఆవు పిడకలపై నెయ్యి, హారతి కర్పూరం, వేపాకు, పాలుగారే, ఎండిన కట్టెలు, పసుపు, వెల్లుల్లి పొట్టు ఇందులో వాడుతున్నారు. ఇవన్నీ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో పేర్చి సాయంత్రం రాత్రి సమయంలో యువకులంతా కలిసి ఒకే సారి వీటిని దహనం చేస్తారు దీంతో ఒకేసారి ఊరంతా పొగ వ్యాపిస్తుంది. ఈ పొగవల్ల కరోనా వైరస్ను నియంత్రించవచ్చని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు.
- Advertisement -