- Advertisement -
కరోనా నేపథ్యంలో తెలంగాణలో బత్తాయి, నిమ్మ రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడం హర్షణీయం అన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.సీఎం కేసీఆర్ చెప్పినట్లు రాష్ట్రంలో బత్తాయి, నిమ్మకాయలను విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో బత్తాయి, నిమ్మల్లో ఉండే సీ విటమిన్ కీలకం అని చెప్పారు.
బత్తాయి, నిమ్మ పండ్లను ఇక్కడే విక్రయించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి దోహదపవచ్చని తెలిపారు. రైతుల పంటల విక్రయానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
- Advertisement -