కరోనాపై పోరు…సింగరేణి ఉద్యోగుల పెద్ద మనసు

466
Singareni Employees
- Advertisement -

అత్యవసర సేవలలో భాగంగా బొగ్గు మరియు విద్యుత్ ఉత్పత్తిని నిర్విరామంగా కొనసాగిస్తున్న సింగరేణి ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి, తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్య మంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. సింగరేణి అధికారుల సంఘం(సి.ఎం.ఓ.ఏ. ఐ) తో పాటు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) నాయకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తమ వేతనం నుండి ఒక్కరోజు బేసిక్ మరియు డి.ఏ ను, రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధికి చెల్లించడానికి అంగీకరించి వలసినదిగా వారు శనివారం యాజమాన్యానికి లేఖలు రాశారు . సింగరేణి లో గల దాదాపు 2400 మంది అధికారులు ఒక రోజు బేసిక్ మరియు డి .ఏ కలిపి 1 కోటి రూపాయలు ,47 వేల మంది కార్మికుల ఒకరోజు బేసిక్ మరియు డి ఏ కలిపి 7కోట్ల 50 లక్షలు కలిపి మొత్తం 8 కోట్ల 50 లక్షల రూపాయలను రాష్ట్ర ముఖ్య మంత్రికి అందజేయనున్నామని అధికారుల సంఘం నాయకులు జక్కం రమేష్, ఎన్.వి.రాజ శేఖర్ రావు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, బి.వెంకట్రావు,శ్రిమిరియల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఇంతకుముందు కూడా దివిసీమ ఉప్పెన ,లాతూర్ భూకంపం, కేరళ వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయాలలో l సింగరేణి ఉద్యోగులు ఇదే విధంగా తమ మానవీతను వితరణను చాటుకున్నారు.

- Advertisement -