గుడ్ న్యూస్‌ : టీవీలో మళ్లీ రామాయణం

286
ramayan
- Advertisement -

కరోనా ఎఫెక్ట్‌తో ఇంట్లో ఉండి బోర్ కొడుతోందా…అయితే ఇది మీకోసమే. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితం అయిన నెటిజన్లు రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ను పునఃప్రసారం చేయాలంటూ ట్విటర్‌ లో రిక్వెస్ట్ చేయగా వారి కోరిక మేరకు రామాయణ్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నట్టు సమాచార ప్రసార శాఖామంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు.

రామాయణం, మహాభారతం ఎన్ని సార్లు చూసిన, విన్నా తనివితిరనివే.. దూరదర్శన్‌లో 33 ఏళ్ల కిందట ప్రసారమైన ఈ సీరియళ్లు ఓ చరిత్రను సృష్టించాయి. అయితే ఈ సీరియళ్లు ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యన ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాయి.

మార్చి 28 (శనివారం) నుంచి డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌)లో రోజూ రెండు రామాయణ్‌ ఎపిసోడ్‌లు..ఉదయం 9-10 గంటలు, సాయంత్రం 9-10 గంటలకు ప్రసారం కానున్నాయి.

- Advertisement -