కరోనా నియంత్రణకు తెలుగు చిత్రసీమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రభుత్వాలకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. విరాళాలు అందిస్తు, కరోనా బారిన పడకుండా సూచనలు,జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పలువురు సినీ తారలు వీడియోల రూపంలో తమ సందేశాన్ని తెలుపుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆరు గోల్డెన్ రూల్స్’ పాటించాలంటూ కరోనాపై జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ విషయాలను ఆయన గారాల పట్టి సితార కూడా మళ్లీ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేష్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘గోల్డెన్ రూల్స్.. చిన్నారి చెబుతోంది.. వినండి’ అన్నారు. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలని సితార చెప్పింది. ‘ఇంట్లోనే ఉండండి.. సామాజిక దూరం పాటించండి. 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు మీ చేతులు కడుక్కోండి. శానిటైజర్ వాడండి’ అని తెలిపింది.
Golden rules!! When kids speak…u listen…#StayHomeStaySafe 🙏🏻🙏🏻 pic.twitter.com/v8Ih3ps8D0
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2020