సిద్దిపేట జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు..

456
- Advertisement -

సిద్ధిపేటలో కలెక్టరేట్‌లో కరోనా నియంత్రణ ఏర్పాట్లపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రితోపాటు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి చెందకుడండా సిద్ధిపేట జిల్లాలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలి.అన్ని శాఖల‌ అధికారులు సమన్వయంతో పని చేయాలి. జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్యవసరాలపై తెలికాన్ఫరెన్సు ద్వారా చర్చించాం. ఈ టెలికాన్ఫరెన్సు లో 950 మంది అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.. పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించాం. విదేశాల నుంచి 456 మంది వచ్చారు. వీరిలో 239 మంది క్వారయింటైన్ పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. మిగిలిన వారు క్వారయింటైన్ లో ఉన్నారు. వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాం. ఈ మూడు నాలుగు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, వారిని కూడా 14 రోజుల క్వారయింటైన్ లో ఉంచాలని ఆదేశించామన్నారు.

harish in siddipet

ప్రజలకు, రైతులకు ఇతరులకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలి.జిల్లాలో 7 వేల ఎకరాల్లో కూరగాయలు పండించే రైతులు ఉన్నారు. వారు తమ కూరగాయలను అమ్ముకువడానికి పాసులు ఇస్తున్నాం. హైదరాబాద్ కు, ఇతర మార్కెట్ల కు పంపించడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కూరగాయల క్రయవిక్రయాలు ఇక నుంచి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ప్రత్యామ్నాయంగా వారంలో మూడు రోజులేనని ఆది, బుధ, శుక్రవారం రోజులు తాత్కాలిక మార్కెట్లు నడుస్తాయన్నారు.

రాష్ట్ర స్థాయి కో ఆర్డినేషన్ కమిటీతో ఈ కమిటీ కలిసి పని చేస్తుంది.జిల్లాలో మూడు దేశాల తెలికాన్ఫరెన్సు సదుపాయం. 3 నుంచి 4 వరకు గ్రామీణ స్థాయి అధికారులతో, 4 నుంచి5 వరకు ఆర్డీఓ తన పరిధిలోని అధికారులతో, 5 నుంచి 6 వరకు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో రోజు తెలికాన్ఫరెన్సు ఉంటుంది. వంటిమామిది కూరగాయల మార్కెట్ ను ఓపెన్ చేస్తున్నాం. డివిజన్ల వారిగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. జిల్లాలో ఈ రోజు నుంచి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఇది రౌండ్ ద క్లాక్ పని చేస్తుంది. అత్యవసరం అయితే ఉదయం 8 టూ రాత్రి 8 వరకు 9849903256, రాత్రి 8 టూ ఉదయ్ 8 వరకు 8008555613 ఈ నెంబర్లు పని చేస్తాయి.

minister harish

స్వీయ క్రమశిక్షన పాటించాలి.. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించాలి. పరిస్థితి చేయి దాటాక ముందే జాగ్రత్తగా ఉండాలి. ఒక్క రోజు బయటకు వస్తే వారం రోజులకు సరిపడ సరుకులు కొనుక్కెల్లండి. శానిటేషన్ సిబ్బందికి మస్క్ లు, సానీతైజర్లు అందించాం. జిల్లాలో వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చాలా బాగా పని చేస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేస్తున్నారు. ఏ గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులు అక్కడి అధికారులకు సహకరించాలి.

అక్కడక్కడ చెట్ల కింద, ఇళ్లల్లో పేకాట వంటి ఆటలు ఆడుతూ గుంపులుగా చేరుతున్నట్లు సమాచారం.. అలాంటి వారు ఇకనైనా మానుకోవాలి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాము. కరోన వస్తే భయపడాల్సిన పని లేదు.. మీకు మీరు బాధపడుతూ ఎవరికి చెప్పుకుంటే మీకు మీరు, మీ కుటుంబానికి, సమాజానికి ద్రోహం చేసిన వారవుతారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ పై దుష్ప్రచారం జరుగుతున్నది.. ఇదంతా అబద్ధం, ఏదైనా వైద్యుల పత్యవేక్షణలోనే వాడాలి. అని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -