ప్రజలు పుకార్లను నమ్మవద్దని సూచించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. వైరస్ ను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సూచనలు చేశారు.
సామాజిక బాధ్యతగా ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలన్నారు మంత్రి కొప్పుల. 100 ఐసోలేషన్ ప్రత్యేక బెడ్ లు ఏర్పాటుచేయాలని.. రాపిడ్ యాక్షన్ బృందాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. రేషన్ పంపిణీ సజావుగా జరగాలన్నారు.
నిత్యావసర వస్తువులకు కొరతలేదు కావలసినవన్నీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇండోనేషియా బృందంతో సన్నిహితంగా మెలిగిన వారిని తప్పనిసరిగా గురు గృహనిర్బంధం చేశామన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు స్వీయ నిర్భంధం పాటించకుంటే కఠిన చర్యలు. వారిపై నిఘా కొనసాగుతుందన్నారు.
నిత్యవసర వస్తువులు ఎక్కువ ధరలు పెంచి అమ్మే వ్యాపారులపై 9989071042 9177641042 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని… జిల్లా వ్యాప్తంగా అనుమానితులను గుర్తించడానికి 389 బృందాలు ఏర్పాటుచేశామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దినసరి కూలీలకు అవసరమైన వసతి కల్పించాలన్నారు. మార్కెట్లలో రద్దీ లేకుండా చూడాలి మనుషుల మధ్య మీటరు దూరం నిబంధన తప్పకుండా అమలు చేయాలని.. అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేస్తామన్నారు.
.