సంకట సమయంలో దేశం మొత్తం ఒక్కటిగా నిలిచిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ…జనతా కర్ఫ్యూను ప్రతిఒక్కరు విజయవంతం చేశారని తెలిపారు. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో అందరం తెలుసుకున్నామని చెప్పారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని..ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సవాల్ విసురుతునే ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సాహయ స్ధితిలో ఉన్నాయని చెప్పారు. వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించడం తప్ప వేరే మార్గం లేదన్నారు.
కరోనా వైరస్ సైకిల్ ని అడ్డుకుని తీరాలని చెప్పారు. ఈ నిర్లక్ష్యం కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తంలో లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఇల్లు విడిచిరావడం పూర్తిగా నిషేధం అన్నారు. 21 రోజులు దేశంలో కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.
కరోనా వైరస్ కంట్రోల్ కావడానికి 21 రోజులు పడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారని చెప్పారు. కొన్నాళ్లపాటు ఇంటిలో నుండి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలన్నారు. వైద్య,ఆరోగ్య రంగంలో ఇటలీ ప్రధమ స్ధానంలో ఉందని అలాంటి ఇటలీనే కరోనా అతలాకుతలం చేసిందన్నారు.