సిబ్బందికి మూడు నెలల జీతం ఇచ్చిన ప్రకాశ్ రాజ్

390
Prakash_Raj
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో ఈనెల 31వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని వ్యాపారాలు మూసేయాలని ఆదేశించారు. దీంతో రోజు కూలి పనులు చేసుకునే వారు తీవ్రంగా నష్టపోనున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం బియ్యంతో పాటు రూ.1500 ఇవ్వనున్నారు.

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ , క్యారెక్టర్ ఆర్టిస్టులు తీవ్రంగా ప్రభావం చూపనుంది. అలాంటి వారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ సూచించారు. తన పొలంలో పని చేస్తున్న వారితో పాటు ఇళ్లు, ప్రొడక్షన్ కంపెనీ, ఫౌండేషన్‌ ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల (మే వరకు) జీతాలు ముందుగానే ఇచ్చేసినట్టు తెలిపారు. కరోనా కారణంగా తాను చేస్తున్న మూడు సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఆ మూడు సినిమాల్లో తన కోసం పనిచేస్తున్న సిబ్బందికి సగం జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిగతా వాళ్లు కూడా ఇలాకే తమ సిబ్బందికి ఆర్ధికసాయం చేయాలని కోరారు.

- Advertisement -