కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యుద్ధ విన్యాసాలు,సమావేశాలను రద్దు చేసింది. ఈ మేరకు అన్ని ఆర్మీ కమాండ్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది భారత ఆర్మీ. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న సైనికులు సమీప మిలిటరీ హాస్పటల్‌కు వెళ్లాలని సూచించింది. లేహ్‌కు చెందిన ఓ జవానుకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆప్రమత్తమైంది ఆర్మీ.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించింది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు మినహా మిగతా శాఖల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇక వైరస్ ప్రబలకుండా హైదరాబాద్‌లోని సెక్రెటేరియట్తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకను నిలిపి వేసింది. ఒకవేళ ఎవరికైనా అత్యవసర పని ఉంటే ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించారు.