ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత..విషెస్ చెప్పిన పోచంపల్లి

290
pochampally srinivas reddy
- Advertisement -

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ని నిజామాబాద్ స్ధానిక సంస్ధల అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి . మాజీ ఎంపీ కవితని ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ అర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

కవిత ప్రాతినిధ్యం శాసన మండలికి, మహిళా లోకానికి ఖచ్చితంగా గౌరవాన్ని పెంచుతుందన్నారు. నాటి ఉద్యమం నుండి నేటి తెలంగాణ దాకా సాంస్కృతిక సేనాని గా కవిత పని చేశారని చెప్పారు. తెలంగాణ బతుకమ్మ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చారన్నారు.

పార్లమెంట్ లో తెలంగాణ వాణీ ని ఘనంగా చాటారు. మంచి పార్లమెంటరీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. శాసన మండలిలోనూ తన వాక్‌పటిమ తో గౌరవం పెంచుతారని… శాసన మండలి సభ్యురాలిగా నామినేషన్ వేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -