కరోనా వైరస్…ప్రైవేట్ హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు

413
Hostel.jpeg
- Advertisement -

కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో విద్యాసంస్ధలు, థియేటర్లు, జిమ్, పబ్ లు మూసేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో ఉన్న ప్రైవేటు హాస్టళ్లను ఖాళీ చేయాలని నోటిసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. ఎస్ఆర్ నగర్ , అమీర్ పేట్ ప్రాంతాల్లో 500లకు పైగాఉన్న లేడిస్, జెంట్స్‌ హాస్టళ్లను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈనెల 18 నుంచి 31వరకు పూర్తిగా మూసివేయాలంటూ నోటిసులు జారీ చేశారు. ఇక అమీర్ పేట్ , ఎస్ ఆర్ నగర్ లో ఎక్కువగా కోచింగ్ , ఉద్యోగాలు చేస్తున్న వారు హాస్టళ్లలో ఉంటున్నారు.

- Advertisement -