ఇదో కొత్త శకం..కరోనాపై సన్నిలియోన్ ట్వీట్

426
sunny leone family
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఇండియాలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 107కు చేరుకుంది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా కరోనా వైరస్ ను రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు సెలబ్రెటీలు తమ అభిమానులకు ట్వీట్టర్ ద్వారా తెలుపుతున్నారు.

తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సన్నిలియోన్ కరోన్ వైరస్ పై స్పందించింది. కరోనా వైరస్‌ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ తన ముగ్గురు పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. మాస్కులు ధరించి తాను, తన భర్త , పిల్లలతో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. మా పిల్లలు ఇప్పుడు ఇలా జీవించాల్సి వస్తుండడం చాలా బాధాకరం.. కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మాస్కులు ఎలా ధరించాలన్న విషయంపై పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను అని ట్వీట్ చేసింది.

- Advertisement -