- Advertisement -
హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆస్పత్రిని పరిశీలించారు కలెక్టర్ శ్వేతా మహంతి. ఆస్పత్రిలోని కరోనా ఐసోలాషన్ వార్డుని సందర్శించారు.సరోజిని దేవి కంటి ఆసుపత్రి లో 150 ఐసోలాషన్ పడకల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇక మరోవైపు కారోన పై సర్కార్ హై అలెర్ట్ అయింది. మహారాష్ట్ర లో కరోన కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి తెలంగాణ కి వచ్చే రూట్లలో చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసింది.
రాష్ట్రంలోని మార్కెట్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
- Advertisement -