- Advertisement -
భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్…తర్వాత వరుస సినిమాలతో జోష్‌మీదున్నాడు. వెంకీ కుడముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. రీసెంట్‌గా సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని అభినందించారు.
చిరు ప్రశంసలతో మురిసిపోయారు వెంకీ కుడుముల. చిరంజీవితో కలిసి సినిమా చూడటం అనేది తన కల..అది నెరవేరిందన్నారు. మా సినిమాని చూసి అభినందించిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వెంకీ…జీవితంలో ఈ సందర్భాన్ని మర్చిపోలేనిన తెలిపారు.
ప్రస్తుతం చిరు…కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
- Advertisement -